పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ రీ-ఎంట్రీ సినిమా `వకీల్ సాబ్` నుంచి సంక్రాంతి బహుమతి సిద్ధమవుతోంది. గురువారం సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు టీజర్‌ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ టీజర్‌తో పాటే సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించబోతున్నట్టు తెలుస్తోంది. మార్చి 26న `వకీల్ సాబ్` సినిమా విడుదల కాబోతున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి.
ఆ వార్త ఎంతవరకు నిజమనేది గురువారం విడుదలయ్యే టీజర్‌తో క్లారిటీ వస్తుందేమో చూడాలి. దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలె పూర్తయింది. శ్రుతీహాసన్ ఓ కీలక పాత్ర పోషించింది. తమన్ సంగీతం అందించాడు. ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను ఓ ఛానెల్ భారీ ధరకు దక్కించుకున్నట్టు తెలుస్తోంది.