Abn logo
Apr 8 2021 @ 13:55PM

మహేష్ మల్టీప్లెక్స్‌లో 'వకీల్ సాబ్' సరికొత్త రికార్డ్..!

'నేను ట్రెండ్ ఫాలో అవను.. ట్రెండ్ సెట్ చేస్తాను'.. ప్రస్తుతం 'వకీల్ సాబ్' సినిమాకి ఇదే డైలాగ్ ఆపాదించి అభిమనులు హంగామా చేస్తున్నారు. మరికొన్ని గంటల్లో 'వకీల్ సాబ్' థియోటర్స్‌లో దిగబోతున్నాడు. పవర్ స్టార్ పవ కళ్యాణ్ మూడేళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా.. నిర్మాతగా దిల్ రాజు 22 ఏళ్ళ నుంచి పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలని కలలు కన్న సినిమా..అటు అభిమానుల్లో ఇటు ప్రేక్షకులలో.. ఇండస్ట్రీ వర్గాలలో ఊహకందని విధంగా అంచనాలు ఏర్పడిన సినిమా.. ఇలా చెప్పుకుంటూ పోతే 'వకీల్ సాబ్'కి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అభిమానులే కాదు ప్రేక్షకులు కరోనా సెకండ్ వేవ్‌ని కూడా లెక్క చేయకుండా పట్టం కడుతున్నారు. 

అందుకు ఉదాహరణ ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే తెలుస్తోంది. ఇంతక ముందెన్నడూ ఏ తెలుగు సినిమాకి లేని విధంగా అమెరికాలో ఏకంగా 700 స్క్రీన్స్‌లో 'వకీల్ సాబ్' ప్రదర్శింపబడనుండటం రికార్డ్ అని చెప్పక తప్పదు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశ వ్యాప్తంగా వకీల్ సాబ్ రికార్డ్ స్థాయిలో షోలు వేయనున్నారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు మల్టీప్లెక్స్ ఏఎంబీలో పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేసింది. ఏఎంబీ లో మొత్తం 7 స్క్రీన్స్ ఉండగా.. ఏడు స్క్రీన్స్ కలిపి 'వకీల్ సాబ్' మొదటిరోజు 27 షోలు ప్రదర్శింపనున్నారు. 'వకీల్ సాబ్' విడుదలకు నాలుగు రోజుల ముందే ఏఎంబీలో మొత్తం 27 షోలకు  టికెట్లు బుక్ అవడం విశేషమని చెప్పాలి. అది కూడా కొన్ని గంటల్లోనే అని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మ్యానియా ఏంటో అర్థమవుతోంది. 

Advertisement
Advertisement
Advertisement