Jun 15 2021 @ 12:39PM

‘వకీల్ సాబ్’ మళ్లీ వస్తుండు..!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం వ‌కీల్‌సాబ్‌. శ్రీరామ్ వేణు ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 9న సినిమా విడుద‌లైంది. అయితే కొవిడ్ సెకండ్ వేవ్ కార‌ణంగా థియేట‌ర్స్ మూత ప‌డ‌టంతో వ‌కీల్‌సాబ్ సినిమాను ప్రేక్ష‌కులు థియేట‌ర్‌లో చూసే అవ‌కాశం లేకుండా పోయింది. ఇప్పుడు ప‌రిస్థితులు కాస్త చ‌క్క‌బడుతున్నాయి. దీంతో మ‌ళ్లీ థియేట‌ర్స్ ఓపెన్ అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో దిల్‌రాజు వ‌కీల్‌సాబ్ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు వంద‌ల థియేట‌ర్స్‌లో యాబై శాతం ఆక్యుపెన్సీతో విడుద‌ల చేసేలా ప్లాన్ చేస్తున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఈ వార్త‌ల‌పై దిల్‌రాజు అండ్ టీమ్ ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి.