Oct 22 2020 @ 14:06PM

`వకీల్ సాబ్` సెట్స్ మీదకు వస్తున్నాడా?

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ రీ-ఎంట్రీ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. హిందీలో విజయవంతమైన `పింక్` రీమేక్ `వకీల్ సాబ్`తో పవన్ వెండితెర పునరాగమనం చేయబోతున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ కొంత మిగిలిపోయింది. 


ప్రభుత్వం నుంచి అనుమతులు లభించిన నేపథ్యంలో ఈ నెల రెండో వారం నుంచి షూటింగ్ ప్రారంభించాలనుకున్నారు. అయితే హైదరాబాద్‌లో వర్షాల కారణంగా కుదరలేదు. దీంతో వచ్చే నెల మొదటి వారం నుంచి షూటింగ్ ప్రారంభించబోతున్నట్టు సమాచారం. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకుడు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.