Abn logo
May 8 2020 @ 20:54PM

వ‌క్కంతం నెక్ట్స్ మూవీ హీరో..?

ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు ర‌చ‌యితగా ప‌నిచేసిన వ‌క్కంతం వంశీ అల్లు అర్జున్ హీరోగా న‌టించిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాతో డైరెక్ట‌ర్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. అయితే సినిమా ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో వ‌క్కంతం వంశీకి డైరెక్ట‌ర్‌గా వెంట‌నే అవ‌కాశాలు రాలేదు. అయితే ఇప్పుడు మ‌ళ్లీ వక్కంతం మ‌రో సినిమాను డైరెక్ట్ చేయ‌డానికి సిద్ధ‌మవుతున్నాడ‌ని టాక్‌. ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా వ‌క్కంతం వంశీ త‌దుప‌రి సినిమా తెర‌కెక్కే అవ‌కాశాలున్నాయంటున్నాయి. మ‌రి ఇందులో నిజా నిజాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. 

Advertisement
Advertisement
Advertisement