Advertisement
Advertisement
Abn logo
Advertisement

భువనేశ్వరి కాళ్లను కన్నీళ్లతో కడుగుతాం: రాచమల్లు

కడప: భువనేశ్వరికి కన్నీళ్లుతో కాళ్లు కడుతానని కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. మహిళను ఎవరు కించపరిచినా అది తప్పేనన్నారు. ఈ విషయానికి ముగింపు పలకాలని ఎమ్మెల్యేగా విజ్ఞప్తి చేస్తున్నానని ప్రకటించారు. ఒకవేళ భువనేశ్వరి అక్క తనని అనరాని మాటలు, వ్యక్తిత్వాన్ని కించపరిచారని భావించి ఉంటే.. ఆమె అనుమతితో కన్నీళ్లతో కాళ్లు కడుగుతానని తెలిపారు. వైఎస్ సతీమణి విజయలక్ష్మి అయినా.. చంద్రబాబు సతీమణి అయినా ఒకే గౌరవం ఉంటుందని చెప్పారు.


అసెంబ్లీలో భువనేశ్వరిని వైసీపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపాయి. భువనేశ్వరికి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ క్షమాపణ చెప్పారు. ‘‘నేను అలా మాట్లాడి ఉండకూడదు.. పొరపాటున ఓ మాట దొర్లాను.. అలా మాట్లాడటం తప్పే..! ఎవరు అలా మాట్లాడినా తప్పే.. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి క్షమాపణ చెప్పడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు’’ అని వంశీ ప్రకటించారు. వంశీ వ్యాఖ్యలకు కొనసాగింపుగా అసెంబ్లీలో పలువురు వైసీపీ మంత్రులు.. ఎమ్మెల్యేలు భువనేశ్వరిపై వ్యాఖ్యలు చేయడం.. వాటిపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా కలతచెందిన విషయం తెలిసిందే. 


Advertisement
Advertisement