సీతాకోకచిలుకల లోయ!

ABN , First Publish Date - 2021-03-04T05:34:49+05:30 IST

ఆ లోయలో అడుగుపెడితే కొన్ని వేల సీతాకోకచిలుకలు కనిపిస్తాయి. సీతాకోకచిలుకలు వాలడంతో చెట్లు సైతం దుప్పట్లు కప్పుకున్నట్టుగా కనిపిస్తాయి. అందుకే ఈ లోయకు ‘ద వ్యాలీ ఆఫ్‌ బటర్‌ఫ్లైస్‌’ అని పేరు

సీతాకోకచిలుకల లోయ!

ఆ లోయలో అడుగుపెడితే కొన్ని వేల సీతాకోకచిలుకలు కనిపిస్తాయి.  సీతాకోకచిలుకలు వాలడంతో చెట్లు సైతం దుప్పట్లు కప్పుకున్నట్టుగా కనిపిస్తాయి. అందుకే ఈ లోయకు ‘ద వ్యాలీ ఆఫ్‌ బటర్‌ఫ్లైస్‌’ అని పేరు. 

  • గ్రీక్‌ ఐలాండ్‌ ‘రోడ్స్‌’కు 25 కిలోమీటర్ల దూరంలో ఉందీ సీతాకోకచిలుకల లోయ. వర్షాకాలం ముగిసిన తరువాత కొన్ని వేల సీతాకోకచిలుకలు ఇక్కడకు చేరుకుంటాయి. వేసవికాలం ప్రారంభం కావడంతో ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వలస వస్తాయి. 
  • ఈ వ్యాలీలో సువాసనలు వెదజల్లే ఓరియంటల్‌ స్వీట్‌ గమ్‌ ట్రీస్‌ ఉన్నాయి. ఈ వృక్షాలు సీతాకోకచిలుకలను ఆకర్షిస్తాయి. బటర్‌ఫ్లైస్‌ లోయలోకి చేరుకుని చెట్ల కాండాలపై వాలి సెటిల్‌ అయిపోతాయి.
  • వేసవి ముగిసే వరకు లోయలోనే ఉంటాయి. వీటిని చూడటానికి పర్యాటకులు సైతం అధిక సంఖ్యలో వస్తుంటారు. అయితే పర్యాటకులు చప్పట్లు కొట్టడం, శబ్దాలు చేయడం వల్ల సీతాకోకచిలుకలు తరచుగా స్థానం మారాల్సి వస్తోంది. దీనివల్ల అవి శక్తిని కోల్పోయి చనిపోతున్నాయని నిపుణులు అంటున్నారు.

Updated Date - 2021-03-04T05:34:49+05:30 IST