Abn logo
May 14 2021 @ 00:39AM

వలంటీర్ల సేవలు వెలకట్టలేనివి

బాచిన


అద్దంకి, మే 13 : సంక్షేమ పథకాలు అర్హులంద రికీ చేర్చటంలో వలంటీర్ల సేవలు కీలకమని ని యోజకవర్గ  వైసీపీ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య చెప్పారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలు, అద్దంకి నగరపంచాయతీ పరిధిలో ఉత్తమ సేవలు అందించిన వలంటీర్లకు స్థానిక నగరపంచాయతీ కార్యాలయం వద్ద గురువారం జరిగిన కార్యక్రమం లో సేవమిత్ర, సేవారత్న, సేవావజ్రలుగా ప్రశంసా పత్రాలను అందజేసి సత్కరించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రజలకు, అధికారుల కు మధ్య వారధులుగా ఉన్న వలంటీర్లు బాగా ప నిచేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చె ప్పారు. ఈ  కార్యక్రమంలో సంతమాగులూరు మా ర్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ చింతల పేరయ్య, నగర పంచాయతీ వైస్‌ చైర్మన్‌ దేసు పద్మేష్‌, నియోజక వర్గ ప్రత్యేకాధికారి మహబూబ్‌బాషా, కమిషనర్‌ ఫజులుల్లా, తహసీల్దార్‌లు ప్రభాకరరావు, అశోక్‌వ ర్దన్‌, ఎంపీడీవోలు సాయికుమారి, రాజేందర్‌, శ్రీని వాసరావు, కృష్ణకుమారి పాల్గొన్నారు.


Advertisement