బిట్ కాయిన్... పెరుగుతోంది

ABN , First Publish Date - 2021-01-11T00:07:45+05:30 IST

మూడేళ్ళుగా పెరుగుతోన్న క్రిప్టో కరెన్సీ విలువ... ఇప్పుడు మరింత వేగంగా దూసుకుపోతోంది. ప్రస్తుతం భారత కరెన్సీల్లో దీని విలువ రూ. 31 లక్షల పైచీలుకు. సరిగ్గా నెల రోజుల క్రితం... మొన్నటి డిసెంబరు 10 న… బిట్ కాయిన్ విలువ రూ. 13,47,636.64 గా పలికింది. కాగా... ఈ రోజు(పదో తేదీ) నాటికి రోజుకు సమారు రూ. 31 లక్షలకుపైగా ఎగబాకింది. అంతేకాదు... దీర్ఘకాలంలో బిట్ కాయిన్ విలువ 1.46 లక్షల డాలర్లకు చేరుకునే అవకాశాలున్నాయని జేపీ మోర్గాన్ సంస్థ గతేడాది అంచనా వేసిన విషయం తెలిసిందే.

బిట్ కాయిన్... పెరుగుతోంది

 

న్యూఢిల్లీ : మూడేళ్ళుగా పెరుగుతోన్న క్రిప్టో కరెన్సీ విలువ... ఇప్పుడు మరింత వేగంగా దూసుకుపోతోంది. ప్రస్తుతం భారత కరెన్సీల్లో దీని విలువ రూ. 31 లక్షల పైచీలుకు. సరిగ్గా నెల రోజుల క్రితం... మొన్నటి డిసెంబరు 10 న… బిట్ కాయిన్ విలువ రూ. 13,47,636.64 గా పలికింది. కాగా... ఈ రోజు(పదో తేదీ) నాటికి రోజుకు సమారు రూ. 31 లక్షలకుపైగా ఎగబాకింది. అంతేకాదు... దీర్ఘకాలంలో బిట్ కాయిన్ విలువ 1.46 లక్షల డాలర్లకు చేరుకునే అవకాశాలున్నాయని జేపీ మోర్గాన్ సంస్థ గతేడాది అంచనా వేసిన విషయం తెలిసిందే.


ఇక బిట్ కాయిన్ విలువ భవిష్యత్తులో లక్ష డాలర్లకు పైగా చేరుకునే అవకాశముందని  మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మొత్తంమీద కరోనా సంక్షోభం, అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బిడెన్ ఎన్నిక తదితర అంశాల నేపధ్యంలో పెట్టుబడిదారుల ఆలోచనలు మారుతూ వస్తున్నాయి. ఇదే ఇప్పుడు క్రిప్టోకరెన్సీ విలువ పెరగడానికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. 

Updated Date - 2021-01-11T00:07:45+05:30 IST