Advertisement
Advertisement
Abn logo
Advertisement

వామన్ రావు హత్య కేసు సీన్ రీ కన్‌స్ట్రక్షన్

 పెద్దపల్లి: న్యాయవాద దంపతులు వామన్ రావు, నాగమణి హత్య కేసులో పోలీసులు  సీన్ రీ కన్‌స్ట్రక్షన్ పై దృష్టి సారించారు. నిందితులను పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. వామన్ రావు కదలికలు, రెక్కీపై పోలీసులు ఆరా తీస్తున్నారు. న్యాయవాదుల హత్యకు నిందితులు ఎలా రెక్కీ నిర్వహించారనే దానిపై  పోలీసులు కూపీ లాగుతున్నారు. మంథని పట్టణంతో పాటు హత్య జరిగిన ప్రదేశంలో సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌ను పోలీసులు చేస్తున్నారు. నిందితులు కుంట శ్రీనివాస్, చిరంజీవి, కుమార్‌ల ద్వారా పోలీసులు వివరాలు తెలుసుకుంటున్నారు. 


న్యాయవాద దంపతులు వామన్ రావు, నాగమణిలను ఫిబ్రవరి నెలలో నిందితులు దారుణంగా హత్య చేశారు. జిల్లాలోని రామగిరి మండలం కల్వచర్ల పెట్రోల్ బంకు సమీపంలో నిందితులు అడ్డగించి వారిపై దాడికి పాల్పడ్డారు. అనంతరం కత్తులతో దాడి చేసి నరికి చంపారు. 

Advertisement
Advertisement