వామ్మో కుక్కలు

ABN , First Publish Date - 2020-12-05T05:04:38+05:30 IST

Vammo dogs

వామ్మో కుక్కలు
చందుర్తి ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చిన బాధితులు

- గ్రామాల్లో స్వైర విహారం 

- రోజుకో చోట దాడులు

- గాయాలతో ఆస్పత్రుల్లో చేరుతున్న బాధితులు

- ఈ ఏడాది ప్రభుత్వాస్పత్రుల్లో 

 3,090 మందికి చికిత్స 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

శునకాల దాడులతో జనం బెంబేలెత్తిపోతున్నారు. గ్రామాల్లో స్వైర విహారం చేస్తున్నాయి. కనిపించినవారిపై దాడి చేసి గా యపరుస్తున్నాయి. రోజుకో చోట కుక్కల దాడిలో గాయపడిన వారు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో కు క్కల సంఖ్య పెరగడంతో ప్రజలు భయాందోళనకు గురవు తున్నారు. పనుల నిమిత్తం కొత్తవారు గ్రామాల్లో కనిపిస్తే దా డులు చేస్తున్నాయి.  పొలాల వద్దకు వెళ్లే రైతులపైనా, ఆరుబ యట ఆడుకునే పిల్లలపైనా దాడి చేసి గాయపరుస్తున్నాయి. జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో రోజు కు 50 మందికి పైగా కుక్కల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్నారు. జిల్లా కేంద్రంతోపాటు చందుర్తి, ముస్తాబా ద్‌, బోయినపల్లి, వేములవాడ, రుద్రంగి, కోనరావుపేట, గంభీ రావుపేట, తంగళ్లపల్లి, ఇల్లంతకుంట, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లో కుక్కల బెడద ఎక్కువైంది. కుక్కల దాడులు పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వాస్పత్రుల్లో  వ్యాక్సిన్లను సిద్ధం గా ఉంచుతున్నారు. కుక్కల బెడద నివారించాలని స్థానిక సంస్థల  పాలక వర్గాలకు ప్రజలు విన్నవిస్తున్నారు.  అయితే పలు నిబంధనలతో చర్యలు తీసుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. 


ప్రభుత్వాస్పత్రుల్లో 3,090 మందికి చికిత్స 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ ఏడాది ప్రభుత్వాస్పత్రుల్లోనే 3,090 మంది కుక్క కాటుతో చికిత్స పొందారు. ప్రైవేటు ఆస్ప త్రుల్లో అనేక మంది చికిత్స పొందిన సంఘటనలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో ఈ ఏడాది 986 మంది కుక్కకాటుతో చికిత్స పొందారు. ఎల్లారెడ్డిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 489 మంది, వేములవాడ కేంద్రంలో 533, బోయినపల్లి మండలంలోని కొదురుపాక కేంద్రంలో 97, విలాసాగర్‌లో 61, బోయినపల్లిలో 90, గంభీరావుపేట, లింగన్నపేట ఆరోగ్య కేంద్రాల్లో 198, తంగళ్లపల్లి కేంద్రంలో 110, కోనరావుపేటలో 296, ఇల్లం తకుంటలో 135 మంది కుక్క కాటుకు గురై చికిత్స పొం దారు. కొంతమంది ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారు.

Updated Date - 2020-12-05T05:04:38+05:30 IST