Abn logo
Apr 9 2020 @ 13:34PM

మళ్లీ చెర్రీ వద్దకు వంశీ పైడిపల్లి?

`మహర్షి` తర్వాత మళ్లీ సూపర్‌స్టార్ మహేష్ బాబుతోనే సినిమా చేయాలని చాలా కాలం వెయిట్ చేశాడు దర్శకుడు వంశీపైడిపల్లి. అయితే వంశీ చెప్పిన కథ మహేష్‌కు నచ్చలేదు. దీంతో వంశీ సినిమాను పక్కనపెట్టి డైరెక్టర్ పరశురామ్‌కు మహేష్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. 


దీంతో తాజాగా మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్‌ను వంశీ పైడపల్లి కలిసి కథ చెప్పినట్టు తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో `ఎవడు` వంటి హిట్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న చెర్రీని కలిసి వంశీ కథ చెప్పినట్టు సమాచారం. అయితే రామ్‌చరణ్ ఇంకా ఎలాంటి సమాధానమూ చెప్పలేదట. మరి, రామ్‌చరణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. 

Advertisement
Advertisement
Advertisement