వాము చారు

ABN , First Publish Date - 2020-07-13T21:32:29+05:30 IST

వాము - 1 టీ స్పూను, ఎండుమిర్చి - 4, ధనియాలు - ఒక టీ స్పూను, జీలకర్ర - అర టీ స్పూను, నూనె - ఒక టీ స్పూను, ఆవాలు - అర టీ స్పూను, వెల్లుల్లి రెబ్బలు - 4, పచ్చిమర్చి - 2,

వాము చారు

కావలసిన పదార్థాలు: వాము - 1 టీ స్పూను, ఎండుమిర్చి - 4, ధనియాలు - ఒక టీ స్పూను, జీలకర్ర - అర టీ స్పూను, నూనె - ఒక టీ స్పూను, ఆవాలు - అర టీ స్పూను, వెల్లుల్లి రెబ్బలు - 4, పచ్చిమర్చి - 2, చింతపండు రసం - 250 మి.లీ., పసుపు - అర టీ స్పూను, ఉప్పు - రుచికి సరిపడా, కరివేపాకు - 4 రెబ్బలు.


తయారుచేసే విధానం: వాము, 2 ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర వేగించి పొడి చేయాలి. కడాయిలో నూనె వేసి మెంతులు, ఆవాలు, వెల్లుల్లి, 2 ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేగించి చింతపండు రసం పోయాలి. ఇప్పుడు పసుపు, ఉప్పు వేసి మరిగించి వాము పొడి మిశ్రమం కలపాలి. మరో రెండు నిమిషాల తర్వాత దించేసి సర్వ్‌ చేయాలి.

Updated Date - 2020-07-13T21:32:29+05:30 IST