వ్యాను బోల్తా.. ఏడుగురికి గాయాలు

ABN , First Publish Date - 2021-04-11T05:42:17+05:30 IST

ఇనుపరాడ్ల లోడుతో వెళ్తున్న వ్యాను బోల్తాపడి ఏడుగురు యువకులు గాయపడ్డారు. ఈ సంఘట న మండలంలోని రాజులకల్లాలు సమీ పంలోగల బ్రిక్‌ పరిశ్రమ వద్ద శనివా రం చోటుచేసుకుంది.

వ్యాను బోల్తా.. ఏడుగురికి గాయాలు
క్షతగాత్రుల వివరాలు సేకరిస్తున్న ఎస్‌ఐ నీలకంఠం

శృంగవరపుకోట రూరల్‌, ఏప్రిల్‌ 10:  ఇనుపరాడ్ల లోడుతో వెళ్తున్న వ్యాను బోల్తాపడి ఏడుగురు యువకులు గాయపడ్డారు. ఈ సంఘట న మండలంలోని రాజులకల్లాలు సమీ పంలోగల బ్రిక్‌ పరిశ్రమ వద్ద శనివా రం చోటుచేసుకుంది. స్థానికులు తెలి పిన వివరాల ప్రకారం.. మండలంలో ని కాపుసోంపురం గ్రామం వద్ద రాజ మండ్రి కేవీఆర్‌ అనే సంస్థ రైల్వేకు సంబంధించి పనులు నిర్వహిస్తోంది. అయితే వీరి ముడిసరుకు బొడ్డవర గ్రామం వద్ద నిల్వ ఉంచుతారు. అక్కడి నుంచి ఇనుప రాడ్లను వ్యానులో శనివారం తరలిస్తుండగా, రాజుల కల్లాలు వద్ద వ్యాన్‌ అదుపుతప్పి బోల్తా పడింది. ఆ సమయంలో వ్యానులో ఉన్న ఒడిశా రాష్ట్రం మల్కాన్‌గిరికి చెందిన ఇద్దరితో పాటు విశాఖజిల్లా అనంతగిరి మండలం తీగలమడ గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు గాయాలపాలయ్యారు. వీరిని వెంటనే ఎస్‌.కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒడిశాకు చెందిన చిట్టిబాబు, విశాఖ జిల్లా అనంతగిరి మండలానికి చెందిన శ్రీను పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖపట్నం రిఫర్‌ చేశారు. ఎస్‌ఐ నీలకంఠం ఆసుపత్రికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. డ్రైవర్‌ నిర్లక్ష్యంతో పాటు పరిమితికి మించి లోడ్‌ వేయడం వల్ల ఈ సంఘటన జరిగి ఉంటుందని పలువురు అంటున్నారు.

 

 


Updated Date - 2021-04-11T05:42:17+05:30 IST