అప్రోచ్‌ రోడ్డు ఎప్పుడు నిర్మిస్తారు?

ABN , First Publish Date - 2022-03-16T06:26:19+05:30 IST

ఏడాదిన్నర కాలం గడుస్తున్నా కుంగిన ఎన్టీఆర్‌ బ్రిడ్జి అప్రోచ్‌ రోడ్‌ నిర్మించలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు విమర్శించారు.

అప్రోచ్‌ రోడ్డు ఎప్పుడు నిర్మిస్తారు?

మాజీ ఎమ్మెల్యే వనమాడి ఆధ్వర్యంలో ఆందోళన  
కాకినాడ సిటీ, మార్చి15: ఏడాదిన్నర కాలం గడుస్తున్నా కుంగిన ఎన్టీఆర్‌ బ్రిడ్జి అప్రోచ్‌ రోడ్‌ నిర్మించలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు విమర్శించారు. జగన్నాథపురం రెండో బ్రిడ్జి (ఎన్‌టీఆర్‌ బ్రిడ్జి) అప్రోచ్‌రోడ్‌  వెంటనే నిర్మించాలని కోరుతూ మంగళవారం కొండబాబు టీడీపీ శ్రేణులతో కలిసి నల్ల కండువాలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ నగరం నుంచి జిల్లా నలువైపులకు ప్రధాన రహదారి అయినటు వంటి జగన్నాఽథపురం రెండో బ్రిడ్జి కుంగిపోయి సంవత్సరన్నర కాలం గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, స్థానిక శాసనసభ్యునికి కానీ ఎటువంటి చలనం లేదన్నారు. దీంతో ట్రాఫిక్‌ వెతలతో కాకినాడ నగర ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణమే మరమ్మతులు పూర్తి చేసి బ్రిడ్జిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. గత జనవరి నెలలో టీడీపీ నిరసన తెలిపితే స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ వారం రోజుల్లో ఈ బ్రిడ్జి పనులు మొదలు పెడతామని చెప్పారని, మూడు నెలలు కావస్తున్నా పనులు మొదలు పెట్టలేదన్నారు. చంద్రశేఖరరెడ్డి కాకినాడ నగరం మీద కన్నా పెద్దాపురం నియోజకవర్గ మట్టి మీదే ఎక్కువ దృష్టి సారిస్తున్నారన్నారు. ప్రజా సమస్యలపై పాదయాత్రలు చేయకుండా సొంత ప్రయోజనాల కోసం పాదయాత్రలు చేస్తున్నారన్నారు. కాకినాడ నగరంలో నెలకొన్న ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు నిరసనలు చేపడితే బూతులు మాట్లాడటం తప్ప నియోజకవర్గ అభివృద్ధి చేయడం చేతకాదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్ష, కార్యదర్శులు మల్లిపూడి వీరు, తుమ్మల రమేష్‌, వనమాడి ఉమాశంకర్‌, వొమ్మి బాలాజీ, బంగారు సత్యనారాయణ, సీకోటి అప్పలకొండ, ఎండీ అన్సర్‌, దండుప్రోలు నాగబాబు, చెక్కా శ్రీనివాస్‌, చింతలపూడి రవి, జొన్నాడ వెంకటరమణ, రెడ్నం సత్తిబాబు, పోలిపల్లి జగన్‌, మేడిశెట్టి చిన్ని, పాలిక నాని, అరదాడి శివ, ఎస్‌కె రహీం, పొంగా బుజ్జి, మల్లాడి గంగాధరం, గెడ్డం పూర్ణ, చింతా పేర్రాజు, బొడ్డు దేవరాజు, పినపోతు దుర్గారావు, చింతపల్లి కాశి, ఎరిపల్లి రాము, మూగు రాజు, శేరు శ్రీనివాస్‌, అమలకంటి బలరామ్‌, చిక్కాల సత్యవతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-16T06:26:19+05:30 IST