వంగపండు మృతికి పలు సంఘాల సంతాపం

ABN , First Publish Date - 2020-08-05T11:42:21+05:30 IST

ఉత్తరాంధ్ర వాగ్గేయకారుడు వంగపండు మృతి కళారంగానికి తీరని లోటని ప్రజా నాట్యమండలి చింతలపూడి నాయకులు అలెగ్జాండర్‌, ఎస్‌.లెనిన్‌ బాబు అన్నారు.

వంగపండు మృతికి పలు సంఘాల సంతాపం

చింతలపూడి/పాలకొల్లు అర్బన్‌/గణపవరం/పెరవలి రూరల్‌/కొవ్వూరు, ఆగస్టు 4 : ఉత్తరాంధ్ర వాగ్గేయకారుడు వంగపండు మృతి కళారంగానికి తీరని లోటని ప్రజా నాట్యమండలి చింతలపూడి నాయకులు అలెగ్జాండర్‌, ఎస్‌.లెనిన్‌ బాబు అన్నారు. ఉత్తరాంధ్రలో గిరిజనులను భూ పోరాటంలోకి తీసుకువచ్చిన వ్యక్తి వంగపండని, సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా ఆయన పాటల ద్వారా ఎంతో మందిని ఉత్తేజ పరిచారని ఆయన చనిపోవడం కళారంగానికి తీరని లోటన్నారు. పాలకొల్లులోని క్షీరపురి సినీ, టీవీ జూనియర్‌ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ నివాళుల ర్పించింది.


ప్రముఖ విప్లవ రచయిత, వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు మృతి కళామ తల్లికి తీరనిలోటని అసోసియేషన్‌ అధ్యక్ష కార్యదర్శులు భాస్కర రాజు, అప్పలరాజు, బి.హెచ్‌.వెంకటేశ్‌ వడయార్‌, జి.గోపి, రావు, దుర్గేష్‌, రవికుమార్‌  సంతాపం వ్యక్తం చేశారు. నటీనట సంక్షేమ సంఘం నాయకులు వంగా నరసింహారావు, కస్తూరిరావు, యర్రంశెట్టి వెంకట రత్నం, హరిబాబు, వడ్లమాని హరికృష్ణ, రమణ కుమార్‌, అంబటి రాజు,  కళాకారుల సంఘ నాయకులు సంతాపం తెలిపారు. గణపవరంలో సంతాపం తెలిపిన వారిలో దెందుకూరి ప్రసాదరాజు, అఖిలపక్ష కమిటీ కన్వీనర్‌ నంద్యాల రామలింగరాజు, రచయిత తెన్నేటి లక్ష్మీనరసింహమూర్తి, అవధాని సుంకర వెంకటరామయ్య, మాజీ సర్పంచ్‌ కూనిరెడ్డి సోమేశ్వరరావులు ఉన్నారు. పెరవలి మండలం అన్నవరప్పాడు ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో విప్లవ కవి వంగపండుకు మంగళవారం సంతాప సభను శాఖ అధ్యక్షుడు డీవీఎల్‌.హనుమంతరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రముఖ వాగ్గేయ కారుడు వంగపండు ప్రసాదరావు మృతి పట్ల పౌరహక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నంబూరి శ్రీమన్నారాయణ మంగళవారం సంతాపం తెలిపారు.

Updated Date - 2020-08-05T11:42:21+05:30 IST