Abn logo
Sep 27 2021 @ 01:37AM

కొడాలి నానితో వంగవీటి రాధా సమావేశం! అందుకోసమేనంటూ జోరుగా చర్చలు!

గుడివాడ, సెప్టెంబరు 26 : వంగవీటి రాధాకృష్ణ వైసీపీలోకి వస్తారనే ఊహాగానాలు చోటు చేసుకున్నాయి. ఆదివారం గుడివాడలో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. గుడివాడ వైసీపీ నాయకుడు పాలేటి సుబ్రహ్మణం మనవడి పుట్టిన రోజు వేడుకల్లో మంత్రి కొడాలి నానితో పాటు వంగవీటి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఇద్దరూ పరస్పరం పలకరించుకున్నారు. మంత్రి కొడాలి నాని, వంగవీటి రాధా మంత్రి కొడాలికి చెందిన కె కన్వెన్షన్‌ అతిథి గృహంలో రెండు గంటల పాటు సమావేశమయ్యారని సమాచారం. ప్రధానంగా వంగవీటి రాధాకృష్ణ రాజకీయ భవిష్యత్తుపై వారి మధ్య చర్చ జరిగిందని తెలుస్తోంది. సీఎం వై.ఎస్‌. జగన్మోహనరెడ్డితో చర్చించి వైసీపీలో ప్రాధాన్యత కల్పించి ఎమ్మెల్సీ పదవి ఇచ్చేలా ఒప్పిస్తానని మంత్రి కొడాలి నాని ఈ సందర్భంగా వంగవీటి రాధాకు ప్రతిపాదించారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. వంగవీటి రాధాను అభిమానించే గుడివాడ వైసీపీ నాయకులు ఈ ప్రతిపాదనకు ఒప్పుకోవాల్సిందిగా రాధాను ఒత్తిడి చేసినట్టు సమాచారం.