వంగవీటి రాధా ఇంటి దగ్గర పోలీసుల గాలింపు

ABN , First Publish Date - 2021-12-28T23:23:51+05:30 IST

వంగవీటి రాధా ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించిన వారి కోసం పోలీసుల గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నగరానికి చెందిన కొందరు వ్యక్తులపై పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

వంగవీటి రాధా ఇంటి దగ్గర పోలీసుల గాలింపు

విజయవాడ: వంగవీటి రాధా ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించిన వారి కోసం పోలీసుల గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నగరానికి చెందిన కొందరు వ్యక్తులపై పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆరవ సత్యం అనే వ్యక్తి నిన్న ఉదయం నుంచి పోలీసుల అదుపులోనే ఉన్నాడు.  పోలీసుల విచారణలో ఆరవ సత్యం స్పృహ కోల్పోయాడు. ఆంధ్రా హాస్పిటల్‌లో ఆయన చికిత్స పొందుతున్నారు. సత్యాన్ని అదుపులోకి తీసుకున్నా పోలీసులు ధృవీకరించలేదని సమాచారం. ఆరవ సత్యం దేవినేని అవినాష్ ప్రధాన అనుచరుడుగా అనుమానిస్తున్నారు. దేవినేని అవినాష్ అనుచరుడు కావడంతో రాజకీయవర్గాల్లో చర్చించుకుంటున్నారు. 

Updated Date - 2021-12-28T23:23:51+05:30 IST