Advertisement
Advertisement
Abn logo
Advertisement

అమెరికాలో చరిత్ర సృష్టించిన వనితా గుప్తా

  • అసోసియేట్‌ అటార్నీ జనరల్‌గా ఇండో అమెరికన్‌ నియామకం

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 22: ప్రముఖ న్యాయవాది, భారత సంతతికి చెందిన వనితా గుప్తా.. అమెరికాలో అసోసియేట్‌ అటార్నీ జనరల్‌గా నియమితులయ్యారు. ఆమె నియామకానికి యూఎస్‌ సెనేట్‌ బుధవారం ఆమోదముద్ర వేసింది. దీంతో.. అక్కడి న్యాయ విభాగంలో మూడో అత్యున్నత పీఠాన్ని అధిరోహించనున్న తొలి శ్వేతజాతీయేతర వ్యక్తిగా ఆమె చరిత్ర సృష్టించారు. యూఎస్‌ సెనేట్‌లో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఓటింగ్‌లో వనితా గుప్తా నియామకానికి 51-49 ఓట్ల తేడాతో ఆమోదం లభించింది. నిజానికి 100 మంది సభ్యులున్న సెనేట్‌లో డెమోక్రాట్లు, రిపబ్లికన్ల బలం 50-50గా ఉంది. ఒకవేళ ఎన్నిక టైగా ముగిసిన పక్షంలో తన ఓటును వినియోగించుకునేందుకు ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ కూడా బుధవారం సభకు హాజరయ్యారు. 


Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement