Abn logo
Jun 30 2020 @ 12:56PM

తన పెళ్లి గురించి కామెంట్ చేసిన నటికి వనిత ఘాటు రిప్లై!

తన వివాహం గురించి సోషల్ మీడియాలో కామెంట్ చేసిన నటి, వ్యాఖ్యాత లక్ష్మీ రామకృష్ణన్‌కు వనితా విజయ్‌కుమార్ ఘాటు రిప్లై ఇచ్చింది. వనిత ఇటీవల పీటర్ పాల్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇది వనితకు మూడో వివాహం కాగా, పీటర్‌కు రెండో పెళ్లి. ఈ పెళ్లిపై పీటర్ మొదటి భార్య కోర్టుకు వెళ్లారు. తనకు విడాకులు ఇవ్వకుండానే పీటర్ రెండో పెళ్లి చేసుకున్నాడని ఆమె ఫిర్యాదు చేశారు. 


ఈ విషయంపై లక్ష్మీ రామకృష్ణన్ ట్విటర్ ద్వారా విమర్శలు చేసింది. `ఇప్పుడే ఈ వార్త చూశాను. ఇప్పటికే వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు తండ్రైన వ్యక్తిని, మొదటి భార్యకు విడాకులు ఇవ్వని వ్యక్తిని ఎలా వివాహం చేసుకున్నారు. బాగా చదువుకున్న, సెలబ్రిటీ అయిన వారు  ఇలాంటి పెద్ద తప్పు ఎలా చేశారు. అయినా పెళ్లి జరిగిపోయే వరకు పీటర్ మొదటి భార్య ఎందుకు ఆగారు? ముందే ఎందుకు ఆపలేదు` అంటూ లక్ష్మి ప్రశ్నించారు. ఈ ట్వీట్‌పై స్పందించిన వనిత.. `ఇద్దరు మనషులు ఎందుకు విడిపోతారో, ఎందుకు విడాకులు తీసుకుంటారో నీకు తెలుసా? ఈ విషయంతో నీకెలాంటి సంబంధమూ లేదు. కాబట్టి నువ్వు ఇందులో వేలు పెట్టడం మంచిది కాదు. నేను వేరెవరి వ్యక్తిగత జీవితాల్లోనూ తలదూర్చడం లేదు. కాబట్టి దయచేసి నీ పని నువ్వు చూసుకో` అంటూ వనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Advertisement
Advertisement
Advertisement