వరద బాధితులను విస్మరించిన ప్రభుత్వం : నెలవల

ABN , First Publish Date - 2021-12-01T03:04:04+05:30 IST

భారీవర్షాలతో రాష్ట్రం అతలాకుతలమై ప్రాణ, ఆస్తినష్టం జరుగుతున్నా, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం తాడేపల్లి ప్యాలెస్‌ను వీడటం

వరద బాధితులను విస్మరించిన ప్రభుత్వం : నెలవల
వరద బాధితులను పరామర్శిస్తున్న మాజీ ఎంపీ నెలవల, తదితరులు


నాయుడుపేట, నవంబరు 30 : భారీవర్షాలతో రాష్ట్రం అతలాకుతలమై ప్రాణ, ఆస్తినష్టం  జరుగుతున్నా, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం తాడేపల్లి ప్యాలెస్‌ను వీడటం లేదని మాజీ ఎంపీ, సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు. నుడా మాజీ డైరెక్టర్‌ గూడూరు రఘునాథరెడ్డి, నాయకులతో కలసి  మంగళవారం ఎల్‌ఏసాగరంలోని బీడీకాలనీ వరద బాధితు లను పరామర్శించారు. చిన్నారులకు ఆర్థికసాయం అందజే శారు.  అనంతరం మాట్లాడుతూ  నెల రోజులుగా వర్షాలు పడుతుండటంతో కూలీలు, చిరువ్యాపారులు ఉపాధి లేక పస్తులుంటున్నారని, వారికి ప్రభుత్వం 50 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు, రూ.10వేల ఆర్థికసాయం అందించి ఆదుకోవాలన్నారు. ఇంతవరకు వరద బాధితులను అధికా రులు పరామర్శించకపోవడం, వరదనష్టాలను అంచనాలు వేయకపోవడం దారుణమైన విషయమన్నారు.  కార్యక్ర మంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు కందల కృష్ణారెడ్డి, మండల అధ్యక్షుడు కామిరెడ్డి అశోక్‌రెడ్డి, తెలుగు యువత జిల్లా కార్యదర్శి అవధానం సుధీర్‌, పట్టణ కార్యదర్శి నానా బాల సుబ్బారావు, మండల కార్యదర్శి బిరదవాడ నారాయణ, ఎస్సీసెల్‌ కార్యదర్శి దారా రాజేంద్ర, సుబ్రహ్మణ్యం,  తదితరులు ఉన్నారు. 


Updated Date - 2021-12-01T03:04:04+05:30 IST