Advertisement
Advertisement
Abn logo
Advertisement

వర్షాలకు దెబ్బతిన్న పూరిళ్లు

 కూలిన రెండు బ్యారెన్లు

 మర్రిపాడు, నవంబరు 30 : కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలో 10 పూరిళ్లు దెబ్బతినగా, రెండు పొగాకు బ్యారెన్లు కూలిపోయాయి. 40 ఇళ్లలోకి నీళ్లు రావటంతో 167మందిని పునరావాస కేంద్రాలకు, మరికొందరిని  బంధువుల ఇళ్లకు పంపినట్లు తహసీల్దార్‌ అబ్దుల్‌ హమీద్‌ తెలిపారు. కాగా మూడు రోజుల నుంచి పమటినాయు డుపల్లికి రాకపోకలు  స్తంభించాయి. సుమారు 500 కుటుంబాలకు  నిత్యావసరాలు అందడం లేదు. గ్రామంలో 24 మంది గర్భిణీలు, బాలింతలు ఉన్నారని, వారికి వైద్యం అందడం లేదని గ్రామస్థులు పేర్కొన్నారు. పడమటినా యుడుపల్లి వద్ద కేతామన్నేరు వాగు, సన్నవారిపల్లి వద్ద బొగ్గేరు పొంగుతుండడంతో ఉదయగిరి, ఆత్మకూరుల నుంచి బస్సుల రాకపోకలు ఆగిపోయాయి.  మండలంలోని పలు చెరువులు నిండడంతో ఏ సమయాన గండి పడుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement
Advertisement