Abn logo
Sep 28 2020 @ 18:27PM

అమ‌ల అక్కినేని బాట‌లో మ‌రో హీరోయిన్‌

Kaakateeya

కేవ‌లం సినిమాల్లో న‌టిగా మెప్పించ‌డ‌మే కాకుండా వీలున్న‌ప్పుడ‌ల్లా నిజ జీవితంలోనూ మ‌న స్టార్స్ వారి సహృద‌య‌త‌ను చాటుకుంటూనే ఉన్నారు. ఆ కోవ‌లోనే.. అమ‌లా అక్కినేనిలాంటివారు ప‌య‌నిస్తున్నారు. బ్లూక్రాస్ కో ఫౌండ‌ర్‌గా అమ‌ల అక్కినేని, మూగ జీవాల‌కు సేవ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు అదేబాట‌లో ఇప్పుడు శ‌ర‌త్ కుమార్ కుమార్తె, హీరోయిన్‌ వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ ప‌య‌నిస్తున్నారు. వివ‌రాల్లోకెళ్తే.. రాయ‌ల్ కెనిన్ అనే స్వ‌చ్ఛంద సంస్థ‌తో నిర్వ‌హిస్తున్న సేవ్ శ‌క్తి అనే కార్య‌క్ర‌మంలో వ‌ర‌ల‌క్ష్మి పాల్గొంటున్నారు. అందులో భాగంగా 1000 వీధికుక్క‌ల‌కు యాంటీ రాబిస్ ఇంజ‌క్ష‌న్స్‌ను ఇస్తున్నారు. క‌రోనా టైమ్‌లో త‌మ‌కు అండ‌గా నిలుస్తోన్న వాలంటీర్స్‌కు ట్విట్ట‌ర్ ద్వారా ధ‌న్య‌వాదాల‌ను తెలియ‌జేస్తూ.. వీడియోల‌ను కూడా వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ షేర్ చేశారు. 

Advertisement
Advertisement
Advertisement