ఆ ముగ్గురు నేరచరితగలవారే: వర్లరామయ్య

ABN , First Publish Date - 2021-06-14T23:55:11+05:30 IST

ఏపీ గవర్నర్‌ బిశ్వభూషన్ హరిచందన్‌కు తెలుగుదేశం సీనియర్ నేత వర్లరామయ్య సోమవారం లేఖ రాశారు.

ఆ ముగ్గురు నేరచరితగలవారే: వర్లరామయ్య

అమరావతి: ఏపీ గవర్నర్‌ బిశ్వభూషన్ హరిచందన్‌కు తెలుగుదేశం సీనియర్ నేత వర్లరామయ్య  సోమవారం లేఖ రాశారు. సీఎం జగన్‌.. గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించిన.. అభ్యర్థులపై అభ్యంతరం తెలుపుతూ వర్లరామయ్య లేఖ రాశారు. సీఎం ప్రతిపాధించిన నలుగురు అభ్యర్థుల్లో ముగ్గురు నేరచరితగలవారేనని లేఖలో తెలిపారు. తోట త్రిమూర్తులపై చాలా క్రిమినల్‌ కేసులు ఉన్నాయన్నారు. లేళ్ల అప్పిరెడ్డి గురించి రాష్ట్రంలో అందరికీ తెలుసునని చెప్పారు. రమేష్‌యాదవ్‌పై హత్య కేసు ఉందని వర్లరామయ్య లేఖలో పేర్కొన్నారు. 


సీఎం జగన్‌కు చట్టాలపై నమ్మకం లేదు: వర్లరామయ్య

వైసీపీ ప్రభుత్వం అడ్డగోలు, అరాచక, అప్రజాస్వామిక ప్రభుత్వమని తెలుగుదేశం సీనియర్ నేత వర్లరామయ్య అన్నారు. సీఎం జగన్‌కు చట్టాలన్నా, న్యాయశాస్త్రమన్నా ఏమాత్రం నమ్మకం లేదన్నారు.  అవినీతి ప్రభుత్వం అధికారంలో ఉండడం తెలుగువారి దురదృష్టకరమన్నారు. తిరుపతి ఉప ఎన్నికలో ఎన్నో అక్రమాలు జరిగాయని వర్లరామయ్య చెప్పారు. తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్  రేపు జరగనుందనగా, రాష్ట్ర కేబినెట్ మొత్తం చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోనే అప్పుడు ఎందుకుంది? అని ప్రశ్నించారు. కేబినెట్ మొత్తం చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోనే తిష్టవేసిన విషయం ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కి తెలుసా? అని ప్రశ్నించారు. పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగిన చందంగా డీజీపీ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తిరుపతి ఉప ఎన్నికలో కేబినెట్ మొత్తం అక్కడే ఉండడంపై సీఈవోకి ఫిర్యాదు చేయబోతున్నామని వర్ల రామయ్య పేర్కొన్నారు. 

Updated Date - 2021-06-14T23:55:11+05:30 IST