తమిళ నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌కు తెలుగు నాట కూడా ఆదరణ పెరుగుతోంది. ఇటీవల `క్రాక్`లో జయమ్మగా, `నాంది`లో ఆద్యగా నటించి తెలుగు వారిని ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో వరలక్ష్మికి తెలుగు నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయట. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించబోతున్న సినిమాలో వరలక్ష్మి ఓ కీలక పాత్ర పోషించబోతోందట. `పుష్ప` తర్వాత స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో అల్లు అర్జున్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రంలో బన్నీ స్టూడెంట్ లీడర్‌గా, రాజకీయ నాయకుడిగా కనిపించబోతున్నాడంటూ కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. సామాజిక అంశం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రకు వరలక్ష్మిని అనుకున్నారట. చిత్రబందం వరలక్ష్మిని సంప్రదించగా ఆమె ఓకే చెప్పినట్టు సమాచారం. `పుష్ప` విడుదల తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతోంది.