వారంరోజుల్లో నీటి వసతి కల్పిస్తాం..

ABN , First Publish Date - 2021-05-07T03:40:17+05:30 IST

మండలంలోని కసుమూరు పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎదురుగా కొండపై నూతనంగా నిర్మిస్తున్న జగనన్న కా

వారంరోజుల్లో నీటి వసతి కల్పిస్తాం..
పునాది పనులను పరిశీలిస్తున్న గృహ నిర్మాణ శాఖ ఏఈ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో చిరంజీవి

వెంకటాచలం, మే 6 : మండలంలోని కసుమూరు పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎదురుగా కొండపై నూతనంగా నిర్మిస్తున్న జగనన్న కాలనీకి  నీటి వసతిని వారంరోజుల్లో కల్పిస్తామని గృహనిర్మాణ శాఖ ఏఈ సీహెచ్‌ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గురువారం ఎంపీడీవో చిరంజీవితో కలిసి ఆయన కాలనీని సందర్శించారు. ఈసందర్భంగా కాలనీకి  నీటి వసతి లేదని, తాగునీటి కోసం కిలోమీటరు వెళ్లి తెచ్చుకునే పరిస్థితి నెలకొని ఉందని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో గృహనిర్మాణ శాఖ పీడీ ఆదిసుబ్రహ్మణ్యం దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. ఆయన సంబంధింత అధికారులతో మాట్లాడి వారంరోజుల్లో బోర్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం కాలనీలో మూడు పక్కా ఇళ్లకు పునాదులు తీసి పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఏఈ  మాట్లాడుతూ వచ్చే నెల కల్లా కాలనీలను  మొదలు పెడుతామన్నారు. ఆయన వెంట ఏఎంసీ డైరెక్టర్‌ చీకుర్తి నరసయ్య, వైసీపీ నాయకుడు ఎద్దల మస్తానయ్య, గృహ నిర్మాణ శాఖ వర్క్‌ ఇనెస్పెక్ట్టర్‌ సుదర్శన్‌, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ ముజీషీర్‌ తదితరులు ఉన్నారు. 


Updated Date - 2021-05-07T03:40:17+05:30 IST