వరసిద్ధుడి హుండీ ఆదాయం రూ.1.40 కోట్లు

ABN , First Publish Date - 2021-10-23T06:32:40+05:30 IST

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో రూ.1,40,68,958 వచ్చిందని చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈ వో వెంకటేశు తెలిపారు.

వరసిద్ధుడి హుండీ ఆదాయం రూ.1.40 కోట్లు
కానుకలు లెక్కిస్తున్న సిబ్బంది

రికార్డు స్థాయిలో వచ్చిందన్న చైర్మన్‌, ఈవో


ఐరాల(కాణిపా కం), అక్టోబరు 22: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో రూ.1,40,68,958 వచ్చిందని చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈ వో వెంకటేశు తెలిపారు. వీరి పర్యవేక్షణలో శుక్రవారం ఆస్థాన మండపంలో కానుకలను లెక్కించారు. 35 గ్రాముల బంగారు, 1,150 కిలోల వెండి, 271 యూఎస్‌ఏ, 50 ఆస్ట్రేలియా డాలర్లు, 15 యూఏఈ దిర్హామ్స్‌ లభించాయి. కరోనా సమయంలో ఆలయానికి రూ.1.35 కోట్ల వరకు ఆదాయం లభించింది. ప్రస్తుతం ఆలయానికి భక్తుల రాక పెరగడంతో ఆదాయం మరింత పెరిగింది. బోర్డు సభ్యులు నరసింహులుశెట్టి, డిప్యూటీ ఈవో గురుప్రసాద్‌, ఏసీ కస్తూరి, ఏఈవోలు చిట్టెమ్మ, సుధారాణి, విద్యాసాగర్‌రెడ్డి, చంద్రశేఖర్‌, సూపరింటెండెంట్లు శ్రీధర్‌బాబు, కోదండపాణి, యూనియన్‌ బ్యాంక్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-23T06:32:40+05:30 IST