Viral Video: ఇది చూశారా.. పాన్‌, ఐస్‌క్రీం, చాక్లెట్‌తో ఇలా కూడా చేయొచ్చా.. వైరల్ అవుతున్న వీడియో..

ABN , First Publish Date - 2021-11-20T02:46:46+05:30 IST

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఓ దుకాణదారుడు చేసిన వింత ప్రయోగంపై కొందరు ప్రశంసలు కురిపిస్తుంటే.. మరికొందరు.. ఇదేం చెత్త కలయిక అంటూ విమర్శిస్తున్నారు. ఈ వీడియోలో ఓ వ్యక్తి

Viral Video: ఇది చూశారా.. పాన్‌, ఐస్‌క్రీం, చాక్లెట్‌తో ఇలా కూడా చేయొచ్చా.. వైరల్ అవుతున్న వీడియో..

ఇటీవల వంటలకు సంబంధించిన కొత్త కొత్త వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. రోజూ తినే వస్తువులనే కాస్త విభిన్నంగా జోడించి, కొత్త రకం వంటకాన్ని తయారుచేయడం సర్వసాధారణం అయింది. అలాంటి తినుబండారాలు ఎలా ఉంటాయో.. అనే ఆసక్తి అందరికీ ఉంటుంది. వాటిని ఒక్కసారైనా రుచి చూడాలని చాలామంది ఉవ్విళ్లూరుతుంటారు. అలాంటి వారి కోసమే ఈ వీడియో..


సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఓ దుకాణదారుడు చేసిన వింత ప్రయోగంపై కొందరు ప్రశంసలు కురిపిస్తుంటే.. మరికొందరు.. ఇదేం చెత్త కలయిక అంటూ విమర్శిస్తున్నారు. ఈ వీడియోలో ఓ వ్యక్తి చిన్న పాన్‌ను వేడి చేస్తాడు. తర్వాత అందులో చాక్లెట్ ద్రావణాన్ని వేస్తాడు. అనంతరం ఆ ద్రావణంలో లడ్డూలు, ఐస్‌‌‌క్రీం, చాకో చిప్స్ వేసి కొత్త రెసిఫీని తయారు చేస్తాడు. అహ్మదాబాద్‌లోని ఓ దుకాణదారుడు.. ఇలా తన సృజనాత్మకతను చాటుకున్నాడు. పాన్‌ను, లడ్డూలను కలపడం ఏంటని కొందరు అంటుంటే.. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో.. అంటూ మరికొందరు చమత్కరిస్తున్నారు.



Updated Date - 2021-11-20T02:46:46+05:30 IST