Abn logo
Sep 27 2021 @ 00:50AM

టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శిగా వరికుంట్ల

అనిల్‌ (పండు)


పొదిలి, సెప్టెంబరు 26 : తెలుగునాడు విద్యార్థి విభాగం రాష్ట్ర కార్య దర్శిగా వరికుంట్ల అనిల్‌ (పండు) నియ మితులయ్యారు. ఆదివారం ఆమేరకు పార్టీ అధిష్టానం నుంచి ఉత్తర్వులు అం దాయి. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక నాయకుడిగా అనిల్‌ వ్యవహరిస్తున్నారు. ఇటీవల ప్రతిష్టాత్మకంగా జరిగిన స్థానిక ఎన్నికలలో కుంచేపల్లి సర్పంచ్‌గా అనిల్‌ తల్లి కాంతమ్మ ఎన్నికయ్యారు. పొదిలి పట్టణంలోని పలు దేవా లయాలకు పెద్ద ఎత్తున విరాళాలు అందజేసి అనిల్‌ దాతృత్వాన్ని చాటు కున్నారు. దీంతోపాటు మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డికి ప్రధాన అనుచరునిగా వరికుంట్ల గుర్తింపు పొందారు. తనకి పదవి వచ్చేందుకు సహకరించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి లోకేష్‌,  రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ ఎమ్మెల్యే కం దుల,  ఒంగోలు పార్లమెంట్‌ నియోకవర్గ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌లకు అనిల్‌ కృతజ్ఞతలు తెలిపారు. కాగా వరికుంట్లకు పలువురు అభినందనలు తెలిపారు.