కేసులు పెట్టాలని రెచ్చగొడతారా?: వర్ల

ABN , First Publish Date - 2021-05-11T09:37:30+05:30 IST

‘‘సజ్జల రామకృష్ణారెడ్డి బాధ్యతాయుతమైన ప్రభుత్వ సలహాదారు పదవిలో ఉన్నారు. ప్రతిపక్ష నేతపై కేసులు పెట్టాలని ఆయన తమ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టడం దుర్మార్గం

కేసులు పెట్టాలని రెచ్చగొడతారా?: వర్ల

అమరావతి, మే 10(ఆంధ్రజ్యోతి): ‘‘సజ్జల రామకృష్ణారెడ్డి బాధ్యతాయుతమైన ప్రభుత్వ సలహాదారు పదవిలో ఉన్నారు. ప్రతిపక్ష నేతపై కేసులు పెట్టాలని ఆయన తమ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టడం దుర్మార్గం. ప్రభుత్వ ప్రమాణాలను దిగజార్చేలా వ్యవహరించినందుకు సజ్జల తన పదవికి రాజీనామా చేయాలి’’ అని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు. ఆయన సోమవారం ఒక ప్రకటన చేశారు. ‘‘గత రెండేళ్లుగా వేలాది అక్రమ కేసులు పెట్టించారు. ఇప్పుడు ఆ ముసుగు తీసి అక్రమ కేసులు పెట్టాలని బహిరంగంగా పిలుపును ఇచ్చే స్థితికి సజ్జల దిగజారారు. సలహాదారులుగా ప్రతి నెలా మీకు లక్షల రూపాయలు ప్రజా ధనం ఇస్తోంది ఈ రెచ్చగొట్టుడు పనులు చేయడానికేనా? సలహాదారులుగా మీరు ఇచ్చే సలహాలు ఇవేనా!’’ అని వర్ల ప్రశ్నించారు. వ్యాక్సిన్‌ సరఫరాలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించినందుకు సజ్జల ఉక్రోషాన్ని తట్టుకోలేకపోతున్నారన్నారు. డబ్బులన్నీ వ్యాక్సిన్‌ కోసం ఖర్చు చేస్తే తమకు కమీషన్లు రావేమోనన్న బెంగ ఆయనను పట్టి పీడిస్తోందని వర్ల విమర్శించారు. 

Updated Date - 2021-05-11T09:37:30+05:30 IST