Abn logo
Sep 28 2021 @ 16:19PM

ఏపీ అరాచక శక్తులకు అడ్డాగా మారింది: వర్ల రామయ్య

అమరావతి: జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన దగ్గర నుంచి రాష్ట్రం అరాచక శక్తులకు అడ్డాగా మారిందని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి, పొలిట్ బ్యూరోసభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నేరస్తులకు ఏపీ స్వర్గధామంగా, డ్రగ్స్ ట్రాఫికర్స్‌కు పెద్ద ట్రావెల్ జంక్షన్‌లా మారిందన్నారు. ఈ డ్రగ్ ట్రాఫికింగ్ వల్ల రాష్ట్ర యువత నిర్వీర్యమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో ఆషీ ట్రేడింగ్ కంపెనీకి రూ. లక్షా 75 వేల కోట్ల విలువైన హెరాయిన్ గుజరాత్ నుంచి దిగుమతికి నిర్దేశిస్తే, రాష్ట్ర డీజీపీ ఏమీలేదని చెప్పడం విడ్డూరమన్నారు. ఆషీ ట్రేడింగ్ కంపెనీ 9సార్లు జీఎస్టీ చెల్లింపులు చేస్తే, సదరు కంపెనీ కార్యకలాపాలు ఇసుమంతైనా రాష్ట్రంలో లేవని డీజీపీ చెప్పడం, డ్రగ్స్ సరఫరా దారులకు వత్తాసు పలకడమేనన్నారు. 

 

గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో పట్టుబడిన హెరాయిన్ విజయవాడలోని ఆషీ ట్రేడింగ్ కంపెనీకి రావాల్సి ఉందని, దీనికి ముఖ్యమంత్రి, డీజీపీ ఉలిక్కిపడాల్సిందిపోయి, నిమ్మకునీరెత్తినట్టు ఉండటం దేనికి నిదర్శనమని వర్ల రామయ్య ప్రశ్నించారు. అదే ముంద్రా పోర్టు నుంచి జూన్‌లో రూ. లక్షా 75 వేలకోట్ల విలువైన 25 మెట్రిక్ టన్నుల హెరాయిన్ ఆషీ ట్రేడింగ్ కంపెనీకి వచ్చింది నిజంకాదా? అని నిలదీశారు. నిన్నటికి నిన్న మరో మూడు మెట్రిక్ టన్నుల హెరాయిన్ ముంద్రా పోర్టులో సీజ్ చేయడం జరిగిందన్నారు. అంటే ఒక రాష్ట్ర బడ్జెట్ మొత్తం విలువైన హెరాయిన్ సదరు కంపెనీకి వచ్చిందన్నారు. జుల్ఫీ రావుడి అనే వ్యక్తి ఎవరని వర్ల రామయ్య ప్రశ్నించారు. మిడిల్ ఈస్ట్ దేశాల ప్రత్యేక ప్రతినిధిగా నియమించారని, ఆయన ఏ2 విజయసాయిరెడ్డికి మిత్రుడని, జుల్ఫీ రావుడి మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌లో ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు. అతనితో ముఖ్యమంత్రికి, ఏ2కి ఉన్నసంబందమేంటని నిలదీశారు. మనీలాండరింగ్ కోసం, విదేశాల్లో తనకు అవసరమైన అక్రమమార్గాల సంబంధం కోసం సీఎం జుల్ఫీ రావుడిని నియమించారా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఇటువంటి ఉపద్రవాలు ముంచుకొస్తుంటే, నోరువిప్పకపోతే ఎలా? అంటూ వర్ల రామయ్య నిలదీశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...