ఒమిక్రాన్ ముంచుకొస్తున్నా మొద్దు నిద్ర వీడని జగన్: వర్లరామయ్య

ABN , First Publish Date - 2021-12-27T21:23:53+05:30 IST

ఒమిక్రాన్ ముంచుకొస్తున్నా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మొద్దు నిద్ర వీడట్లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు.

ఒమిక్రాన్ ముంచుకొస్తున్నా మొద్దు నిద్ర వీడని జగన్: వర్లరామయ్య

అమరావతి: ఒమిక్రాన్ ముంచుకొస్తున్నా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మొద్దు నిద్ర వీడట్లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా కట్టడి కంటే కక్షసాధింపు చర్యలకే వైసీపీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో 6 ఒమైక్రాన్ కేసుల నమోదయ్యాయని చెప్పారు. పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ, కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారన్నారు. కరోనాకు ముందస్తు చర్యలు లేని రాష్ట్రం ఏపీనేనని అన్నారు.మొక్కబడి సమీక్షలతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సరిపెడుతున్నారని ధ్వజమెత్తారు. జగన్‌రెడ్డి నిర్లక్ష్యంతో కరోనా ఫస్ట్, సెకండ్‌వేవ్‌లో భారీ ప్రాణనష్టం జరిగిందన్నారు. కరోనా మరణాలపై ప్రభుత్వం కాకిలెక్కలు చెప్పిందన్నారు. రాష్ట్రంలో వైద్యశాఖ మంత్రి ఆళ్లనాని జాడ లేదని మండిపడ్డారు. ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు శూన్యమన్నారు. ఏపీలో ఒక్కసారిగా కేసులు పెరిగితే కష్టమేనని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి.. ముందస్తు చర్యలు తీసుకోవాలని వర్లరామయ్య డిమాండ్ చేశారు.

Updated Date - 2021-12-27T21:23:53+05:30 IST