Abn logo
Sep 23 2021 @ 19:16PM

ఏపీలో రూల్ ఆఫ్ లా లేదుః వర్ల రామయ్య

అమరావతి: ఏపీలో రూల్ ఆఫ్ లా లేదని టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. చట్టప్రకారం ప్రభుత్వ యంత్రాంగం పనిచేయడం లేదన్నారు. బద్వేలు పోలీసులు వేధిస్తున్నారని ఓ కుటుంబం వీడియో రిలీజ్ చేసిందని, వారితో మాట్లాడడానికి వెళ్లిన షుబ్లీపై అక్రమ కేసులు పెట్టారని వర్ల ఆవేదన వ్యక్తం చేశారు. కడప పోలీసుల నుంచి రిపోర్ట్ తెప్పించుకోవాలని గవర్నర్‌ను కోరామని చెప్పారు. తప్పుడు కేసులు పెట్టిన పోలీసులను సస్పెండ్ చేయాలని వర్ల రామయ్య ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. 


ఇవి కూడా చదవండిImage Caption