Advertisement
Advertisement
Abn logo
Advertisement

తెలుగు భాషను బూతులమయంగా చేసిన ఘనత వైసీపీదే: వర్ల రామయ్య

అమరావతి: తెలుగు భాషను బూతులమయంగా చేసిన ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదేనని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శాసన సభను కౌరవ సభగా మార్చారన్నారు. ఈ దుష్ట సంప్రదాయం ఏపీ అసెంబ్లీ నుంచి పార్లమెంట్‌కు తీసుకెళ్లారని, అలాంటి పార్టీని ఏమనాలని ప్రశ్నించారు. సిగ్గుమాలిన చర్యలకు వైసీపీ ప్రతీకగా మారిందన్నారు. పార్లమెంట్‌లో బూతులు మాట్లాడిన వైసీపీ ఎంపీలపై లోక్‌సభ స్పీకర్‌ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతలకు తెలుగు తరగతులు తీసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. అధికారం ఉందని ఏదిపడితే అది మాట్లాడితే ప్రజలు వాతలు పెడతారని వర్ల రామయ్య హెచ్చరించారు.

Advertisement

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

Advertisement