కె.కన్వెన్షన్‌లో కేసినో నడిపినట్టు ఆధారాలున్నాయి: వర్ల రామయ్య

ABN , First Publish Date - 2022-01-23T19:20:13+05:30 IST

గుడివాడలో కేసినో కోసం ముందు నుంచే ప్లాన్‌ చేశారని టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు.

కె.కన్వెన్షన్‌లో కేసినో నడిపినట్టు ఆధారాలున్నాయి: వర్ల రామయ్య

అమరావతి: గుడివాడలో కేసినో కోసం ముందు నుంచే ప్లాన్‌ చేశారని టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు. దీనిపై ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కేసినోపై మంత్రి కొడాలి నాని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, అడ్డంగా దొరికిపోయినా ఇంకా బుకాయిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు అన్ని విషయాలు అర్థం అవుతున్నాయన్నారు. ఇలాంటి మంత్రిని సీఎం జగన్ ఎలా సమర్ధించుకుంటారని ప్రశ్నించారు. కె కన్వెన్షన్‌లో కేసినో నడిపినట్టు అన్ని ఆధారాలున్నాయన్నారు. పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కొడాలి నానిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

Updated Date - 2022-01-23T19:20:13+05:30 IST