సీఎంగా ఉండడం నైతికమా?

ABN , First Publish Date - 2021-12-02T09:04:08+05:30 IST

‘‘మీపై ఉన్న అవినీతి కేసులపై న్యాయస్థానాల్లో విచారణ కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి పదవిలో ఉండటం నైతికమేనా? సీఎంగా ఉన్న మీకు

సీఎంగా ఉండడం నైతికమా?

  • మీ అవినీతిపై కోర్టుల్లో విచారణ 
  • ముఖ్యమంత్రిగా రాజీనామా చేయండి
  • జగన్‌కు వర్ల రామయ్య సూచన


విజయవాడ, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): ‘‘మీపై ఉన్న అవినీతి కేసులపై న్యాయస్థానాల్లో విచారణ కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి పదవిలో ఉండటం నైతికమేనా? సీఎంగా ఉన్న మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి సాక్షులు భయపడరా?’’  అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సీఎం జగన్‌ను ప్రశ్నించారు. జగన్‌ తన పదవికి రాజీనామా చేసి సీబీఐ విచారణకు సహకరించకపోతే.. ఆయనకు నైతిక విలువల పట్ల నమ్మకం లేదనే భావించాల్సి ఉంటుందన్నారు. దొంగ పెట్టుబడులతోనే జగన్‌ పత్రిక లాభసాటిగా నడుస్తోందని, తన తండ్రి వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ పదవిని అడ్డుపెట్టుకుని జగన్‌ రూ.43 వేల కోట్లు దోచేశారనే అభియోగాలు ఉన్నాయని తెలిపారు. ఈ అక్రమాలపై విచారణ జరుగుతున్న సమయంలో జగన్‌ సీఎంగా ఉంటే న్యాయం జరగదన్నారు. జగన్‌ రాజీనామా చేయనంటే ఆయన బెయిల్‌ను రద్దు చేసే అధికారం న్యాయస్థానానికి ఉంటుందన్నారు.  

Updated Date - 2021-12-02T09:04:08+05:30 IST