Jun 23 2021 @ 19:22PM

‘స్టాండ‌ప్ రాహుల్’లో శ్రేయారావుగా వ‌ర్ష బొల్లమ్మ

యంగ్ హీరో రాజ్ త‌రుణ్ హీరోగా డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ మరియు హైఫైవ్ పిక్చర్స్ ప‌తాకాల‌పై నంద్‌కుమార్ అబ్బినేని, భరత్ మగులూరి సంయుక్తంగా.. సాంటో మోహన్ వీరంకిని ద‌ర్శకుడిగా పరిచ‌యం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం 'స్టాండప్‌ రాహుల్‌'. కూర్చుంది చాలు అనేది ట్యాగ్ లైన్‌. ఫీల్ గుడ్ రొమాన్స్ కామెడీ చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో రాజ్‌ తరుణ్‌ సరసన వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా నటిస్తోంది. జీవితంలో దేనికోసం ఖచ్చితంగా నిలబడని ఒక వ్యక్తి నిజమైన ప్రేమను కనుగొని, తన తల్లిదండ్రుల కోసం మ‌రియు అతని ప్రేమ కోసం స్టాండ్-అప్ కామెడీ పట్ల ఉన్నత‌న‌ అభిరుచిని చాటుకునే స్టాండ్-అప్ కామిక్ కథ ఇది. తాజాగా ఈ చిత్రంలో శ్రేయారావుగా నటిస్తోన్న హీరోయిన్‌ వర్ష బొల్లమ్మ లుక్‌ని చిత్రయూనిట్‌ విడుదల చేసింది. రాజ్‌త‌రుణ్ పోషిస్తున్న పాత్ర మాదిరిగానే వ‌ర్ష కూడా స్టాండ‌ప్ క‌మెడియ‌న్‌ రోల్ చేస్తున్నట్లుగా ఈ లుక్‌ చూస్తుంటే తెలుస్తోంది. డిఫ‌రెంట్ ఇమేజెస్‌తో ఉన్న వ‌ర్ష బొల్లమ్మ ఫ‌స్ట్ లుక్ పోస్టర్ ఆక‌ట్టుకుంటోంది. ఈ సినిమాకు స్వీకర్ అగస్తి సంగీతం, శ్రీరాజ్ రవీంద్రన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.