Oct 21 2021 @ 11:39AM

‘వరుడు కావలెను’: సెన్సార్ పూర్తి

‘వరుడు కావలెను’ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. యంగ్ హీరో నాగ శౌర్య, రీతూ వర్మ జంటగా నటించారు. లేడీ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య ఈ సినిమాతో టాలీవుడ్‌కు దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. నదియా, మురళీశర్మ, వెన్నెల కిషోర్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. కాగా అన్నీ కార్యమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబధించిన సెన్సార్ కూడా తాజాగా పూర్తై యూ/ఏ సర్టిఫికెట్ పొందింది. అక్టోబర్ 29న ‘వరుడు కావలెను’ విడుదల కానుండగా, మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టనున్నారు.