Sep 25 2021 @ 12:01PM

దసరా కానుకగా 'వరుడు కావలెను'

యంగ్ హీరో నాగశౌర్య, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం 'వరుడు కావలెను'. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసింది చిత్రబృందం. లేడీ డైరెక్టర్ లక్ష్మి సౌజన్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నదియా, మురళీశర్మ, వెన్నెల కిశోర్, ప్రవీణ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా మేకర్స్ వెల్లడించారు. యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని ఇప్పటికే చిత్రబృందం తెలిపింది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైనమెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.