ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో భార్య

స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ సినిమాలో నటించి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నటుడు వరుణ్ ధావన్. ఈ మధ్యనే నటాషా దలాల్‌ అనే ఫ్యాషన్ డిజైనర్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఆమె తన కెరీర్‌ను కొనసాగిస్తునే  ఓటీటీలో కూడా నటించ‌బోతోందని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. ‘‘ సే యస్ టు ద డ్రెస్ ఇండియా ’’ అనే  వెబ్ షోలో ఆమె కనిపించబోతోంది. ఆ షోలో పెళ్లి కూతురికి సహాయపడే పాత్రలో ఆమె నటించనుందని తెలుస్తోంది.


న్యూయార్క్‌లోని ఫ్యాషన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఆమె ఫ్యాషన్ డిజైనింగ్‌ను అభ్యసించింది. అనంతరం సొంతంగా నటాషా దలాల్ అనే లేబుల్‌ను లాంచ్ చేసింది. ఈ లేబుల్ కింద పెళ్లి కూతురి వస్త్రాలను డిజైన్ చేసి విక్రయిస్తుంది. ఇండియాకు 2013లో ఆమె విచ్చేసింది. అనంతరం వరుణ్‌ ధావన్‌ను పెళ్లి చేసుకుంది.  


తాజాగా ఆమె మీడియాకు  ఇంటర్వ్యూ ఇచ్చింది. ‘‘ డిజైనింగ్ అంటే నాకు చాలా ఇష్టం. అటువంటి పాత్రనే ఓటీటీలో పోషించే అవకాశం అభించింది. ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వడానికి ఇంతకంటే మంచి అవకాశం లభించదు. ప్రతి పెళ్లి కూతురికి ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. వారి కళ్లను చూస్తే ఆ విషయం మనకు తెలుస్తుంది. తన కలల దుస్తులను ఎంపిక చేసుకోవడానికి  పెళ్లి కూతురికి సహాయపడే పాత్రలో నేను కనిపిస్తాను ’’ అని నటాషా దలాల్ చెప్పింది.

Advertisement

Bollywoodమరిన్ని...