ప్రైవేట్ మెంబర్ బిల్లుతో మోదీకి షాకిచ్చిన వరుణ్ గాంధీ

ABN , First Publish Date - 2021-12-12T21:05:00+05:30 IST

కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కి చట్టబద్ధత

ప్రైవేట్ మెంబర్ బిల్లుతో మోదీకి షాకిచ్చిన వరుణ్ గాంధీ

న్యూఢిల్లీ : కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కి చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్‌తో బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రతిపాదించారు. రూ.1 లక్ష కోట్లతో హామీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధర పొందేందుకు హామీనిచ్చే రైతుల హక్కుల బిల్లు, 2021 పేరుతో ఈ బిల్లును ప్రతిపాదించారు. 


22 వ్యవసాయోత్పత్తులకు ఎంఎస్‌పీ లభిస్తుందనే చట్టబద్ధ హామీని పొందడమే ఈ బిల్లు ఉద్దేశం. సమగ్ర ఉత్పత్తి వ్యయంపై 50 శాతం లాభంతో ఈ ఎంఎస్‌పీని నిర్ణయించాలని ఈ బిల్లు ప్రతిపాదించింది. ఈ బిల్లును వరుణ్ గాంధీ పార్లమెంటుకు సమర్పించారు. కానీ దీనిని పార్లమెంటులో ప్రవేశపెట్టవలసి ఉంది. 


పార్లమెంటు సభ్యులు తమ పార్టీలతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా బిల్లులను ప్రతిపాదించవచ్చు. 1952 నుంచి సుమారు 12 ప్రైవేట్ మెంబర్ బిల్లులు మాత్రమే ఆమోదం పొందాయి. 


Updated Date - 2021-12-12T21:05:00+05:30 IST