వరుణ్‌‌గాంధీకి కోవిడ్ పాజిటివ్

ABN , First Publish Date - 2022-01-09T21:57:03+05:30 IST

బీజేపీ నేత వరుణ్ గాంధీకి వైద్య పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని వరుణ్‌గాంధీ ..

వరుణ్‌‌గాంధీకి కోవిడ్ పాజిటివ్

లక్నో: బీజేపీ నేత వరుణ్ గాంధీకి వైద్య పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని వరుణ్‌గాంధీ ధ్రువీకరించారు. ఉత్తప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఉండగా తనకు కోవిడ్ పాజిటివ్ అని తేలినట్టు ఆయన ఆదివారంనాడు ఓ ట్వీట్‌‌లో తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, పొలిటికల్ వర్కర్లకు ముందస్తుగా బూస్టర్ డోస్ ఇచ్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను ఆయన కోరారు.


''పిలిభిత్‌లో 3 రోజుల పర్యటన జరిపిన తర్వాత వైద్య పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కోవిడ్ మూడో వేవ్‌లో ఎన్నికల ప్రచారం చోటుచేసుకున్నందున అభ్యర్థులు, పొలిటికల్ వర్కర్లు ముందస్తు బూస్టర్ డోస్‌లు తీసుకునేందుకు ఈసీ నిర్ణయం తీసుకోవాలి'' అని ఆ ట్వీట్‌లో వరుణ్‌గాంధీ పేర్కొన్నారు. వరుణ్‌గాంధీకి ముందు ఈ నెల మొదట్లో ఢిల్లీ మఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం పంజాబ్, ఉత్తరాఖండ్, యూపీ ఎన్నికల ప్రచార సమయంలో తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చినట్టు ప్రకటించారు. ఈ వారం ప్రారంభంలో కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్, హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ సైతం కోవిడ్ పాజిటివ్ బారిన పడ్డారు.

Updated Date - 2022-01-09T21:57:03+05:30 IST