Abn logo
May 23 2020 @ 16:22PM

నా సంగతి పక్కన పెట్టు.. రానా, నితిన్ ఏం చేశారు: సాయితేజ్‌కు వరుణ్ రిప్లై

`ఏంటి బావా.. నీకు పెళ్లంట` అంటూ సాయితేజ్ చేసిన ట్వీట్‌కు వరుణ్ తేజ్ ఫన్నీ రిప్లై ఇచ్చాడు. కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా దీనిపై స్పందించాడు.  `నిహారికకు పెళ్లి.. వరుణ్ తేజ్‌కు కూడా` అని వచ్చిన ఓ వార్త క్లిప్పింగ్‌ను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసిన సాయితేజ్.. `ఏంటి బావా.. నీకు పెళ్లంట` అని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. 


సాయితేజ్ ట్వీట్‌కు స్పందించిన వరుణ్.. `నా పెళ్లికి చాలా టైమ్ ఉందిలే కానీ, మన దగ్గుబాటి రానా, నితిన్ మాత్రం `ఎప్పటికీ మీతోనే..` అని నమ్మించి మన సింగిల్స్ గ్రూప్ నుంచి బయటకు వెళ్లిపోయారు` అని రిప్లై ఇచ్చాడు. ఈ ట్వీట్‌పై వెన్నెల కిషోర్ స్పందిస్తూ.. `ఎప్పటికీ సింగి‌ల్‌గా ఉంటాను, సింగిల్‌గా ఉంటేనే లైఫ్ బాగుంటుంది, సింగిల్ రాక్స్ మొదలైన వాటితో పోల్చుకుంటే.. `దానికి ఇంకా చాలా టైమ్ ఉంది` అనేది చాలా నమ్మదగిన జవాబు` అని ట్వీట్ చేశాడు. 



Advertisement
Advertisement
Advertisement