Abn logo
Feb 14 2020 @ 15:54PM

ఆ సూపర్‌హిట్ సినిమాలను వరుణ్ వదులుకున్నాడట!

`హ్యాపీడేస్` సినిమాతో తెరంగేట్రం చేసిన హీరో వరుణ్ సందేశ్ ఆ వెంటనే `కొత్త బంగారులోకం`తో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. టాలీవుడ్ లవర్‌బాయ్ ఇమేజ్‌ను సంపాదించుకున్నాడు. అయితే ఆ తర్వాత వరుణ్ చేసిన సినిమాలేవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. దీంతో సినిమాలకు కాస్త విరామం ఇచ్చాడు. 


ఇటీవల మళ్లీ `బిగ్‌బాస్` షోతో లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన వరుణ్.. తన కెరీర్ గురించి మాట్లాడాడు. ``హ్యాపీడేస్` విడుదలైనపుడు నాకు 18 సంవత్సరాలు. అప్పటికి నాకు కథలను జడ్జిమెంట్ చేసేంత పరిణితి లేదు. మా నాన్నగారికి కూడా సరైన అవగాహన లేదు. మేం తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల వరుస పరాజయాలెదురయ్యాయి. ఈ క్రమంలో నేను వదిలేసిన కొన్ని సినిమాలు సూపర్‌హిట్లుగా నిలిచాయి. `100%లవ్`, `గుండెజారి గల్లంతయ్యిందే`, `భీమిలి కబడ్డీ జట్టు` వంటి సినిమాలు నేను వదులుకున్నాను. మనకు రాసిపెట్టి లేదంతేన`ని వరుణ్ చెప్పాడు. 

Advertisement
Advertisement
Advertisement