Abn logo
Jan 16 2021 @ 18:17PM

వరుణ్‌తేజ్‌ 10వ సినిమా ఫస్ట్‌లుక్‌కి ముహూర్తం కుదిరింది

మెగాప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ కథానాయకుడు కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్‌ సమర్పణలో రెనసాన్స్‌ ఫిలింస్‌, బ్లూ వాటర్‌ క్రియేటివ్‌ బ్యానర్స్‌పై అల్లు వెంకటేవ్‌, సిద్ధు ముద్ద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్‌తేజ్‌ బాక్సర్‌గా కనిపిస్తున్నారు. ఈ రోల్‌ చేయడానికి వరుణ్‌తేజ్‌ స్పెషల్ డైట్‌ను పాటిస్తూ ఫిట్‌నెస్‌ను మెయిన్‌టెయిన్‌ చేయడమే కాకుండా, ప్రత్యేకంగా అమెరికాకు వెళ్లి శిక్షణను పొందారు. బాలీవుడ్‌ భామ సయీ మంజ్రేకర్‌ హీరయిన్‌గా నటిస్తుందగా ఉపేంద్ర, సునీల్‌ శెట్టి, నవీన్‌ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కాగా.. ఈ జనవరి 19న వరుణ్‌ తేజ్‌ పుట్టినరోజు సందర్భంగా ఉదయం 10 గంటల 10 నిమిషాలకు ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. 

Advertisement
Advertisement
Advertisement