May 7 2021 @ 23:10PM

ట్రైన్‌ హార్డ్‌ ఫైట్‌ ఈజీ

‘ట్రైన్‌ హార్డ్‌ ఫైట్‌ ఈజీ’ అంటున్నారు హీరో వరుణ్‌ తేజ్‌. ఆయన హీరోగా బాక్సింగ్‌ నేపథ్యంలో రూపొందుతున్న స్పోర్ట్స్‌ డ్రామా ‘గని’. ఈ చిత్రంలో బాక్సర్‌ పాత్ర కోసం మంచి ఫిజిక్‌ను మెయింటైన్‌ చేస్తున్నారు వరుణ్‌ తేజ్‌. బాక్సింగ్‌లో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. ఇప్పుడు కరోనా సెక ండ్‌ వేవ్‌తో చిత్రీకరణకు బ్రేక్‌ పడింది. తిరిగి షూటింగ్‌ ప్రారంభమయ్యేదాకా ఫిజిక్‌ షేప్‌ మారకుండా జిమ్‌లో కసరత్తులు చేస్తున్నారు వరుణ్‌ తేజ్‌. జిమ్‌లో తన వర్కౌట్‌కు సంబంధించిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయగా వైరల్‌ అయింది.


‘ట్రైన్‌ హార్డ్‌ ఫైట్‌ ఈజీ’ అంటూ ఆ ఫొటోకు క్యాప్షన్‌ ఇచ్చారు. ‘గని’ చిత్రం జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్‌ కథానాయిక. కన్నడ నటుడు ఉపేంద్ర, సునీల్‌శెట్టి, జగపతి బాబు నవీన్‌ చంద్ర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు ‘ఎఫ్‌ 3’ చిత్రంలోనూ వరుణ్‌తేజ్‌ నటిస్తున్నారు.