వరుణ్ తేజ్ హీరోయిన్ Disha Patani హాలీవుడ్ ఎంట్రీ ..?

బాలీవుడ్ నటులందరూ ఒకరి తర్వాత మరొకరు హాలీవుడ్ సినిమాలకు ఓకే చెబుతున్నారు. ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె, అనిల్ కపూర్ గతంలోనే హాలీవుడ్ సినిమాల్లో నటించగా తాజాగా మరొకరు ఈ జాబితాలోకి చేరబోతున్నారు. ఆమెవరో కాదు లోఫర్ సినిమాలో వరుణ్ తేజ్ సరసన నటించి కుర్రకారు గుండెలను కొల్లగొట్టిన నటి దిశా పటానీ. ఆమె ఒక హాలీవుడ్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని బీ టౌన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 


గతంలో దిశా పటానీ ‘ మలంగ్ ’ అనే సినిమాలో నటించింది. ‘‘ మలంగ్ సినిమాలో ఆమె నటనకు ఒక హాలీవుడ్ డైరెక్టర్ ఫిదా అయ్యారు. కొంతకాలంగా ఆమె వర్క్‌ను గమనిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసే వర్కౌట్ వీడియోలను కూడా ఫాలో అవుతున్నారు. ఆమెతో చర్చలు కొనసాగిస్తున్నారు. వారిద్దరూ కలిసి పనిచేసే అవకాశం ఉంది ’’ అని దిశా పటానీతో సన్నిహితంగా మెలిగే ఒక వ్యక్తి చెప్పారు. ప్రస్తుతానికైతే ఈ వార్తలపై దిశా పటానీ, హాలీవుడ్ దర్శకుడు ఎవరు కూడా స్పందించలేదు. ఆమె హాలీవుడ్ సినిమాలో నటించబోతుందా లేదా అనేది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.


టైగర్ ష్రాఫ్ చేసే యాక్షన్ ఫీట్లకు హాలీవుడ్ నిర్మాత అయిన లారెన్స్ కసనాఫ్ ముగ్ధులయ్యారు. దీంతో అతడిని ఒక హాలీవుడ్ సినిమాలో నటింపచేయాలనుకున్నారు. చర్చల కోసం ముంబైకి కూడా విచ్చేశారు. ప్రస్తుతం ఆ చర్చలు చివరి దశలో ఉన్నాయని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.   

Advertisement

Bollywoodమరిన్ని...