Oct 16 2021 @ 11:43AM

Ghani: రిలీజ్ డేట్ ఇదే!

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా నటిస్తోన్న స్పోర్ట్స్ బేస్డ్ యాక్షన్ మూవీ ‘గని’. కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఒక ఎమోషనల్ అండ్ యాక్షన్ డ్రామా. సిద్ధూ ముద్ద, అల్లు బాబీ సంయుక్త నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ కథానాయికగా నటిస్తోంది. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, బాలీవుడ్ నటుడు సునీల్ షెట్టి ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తుండగా.. అబ్బూరి రవి డైలాగ్స్ రాస్తున్నారు.


ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా.. విజయదశమి పర్వదినాన ఈ సినిమాకి రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియాలో ప్రకటించి.. దసరా శుభాకాంక్షలు తెలియచేస్తూ ఓ పోస్టర్ కూడా విడుదల చేశారు. ‘కంచె’ మూవీతో వార్ డ్రామాలో నటించి మెప్పించిన వరుణ్ తేజ్.. ఇప్పుడు స్పోర్ట్స్ డ్రామాలో కూడా సత్తా చాటుకో నుండడం ఆసక్తిని రేపుతోంది. మరి ‘గని’ గా వరుణ్ ఏ రేంజ్ లో బాక్సాఫీస్ వద్ద పంచ్ విసురుతాడో చూడాలి.