వాసారిష్ట

ABN , First Publish Date - 2021-02-02T07:42:32+05:30 IST

భారతీయ ఆయుర్వేద వైద్యశాస్త్రమునందు కఫ రోగ చికిత్సలో ప్రాచుర్యంలో ఉన్న ఔషధాలలో వాసారిష్ట ఒకటి. దీ

వాసారిష్ట

భారతీయ ఆయుర్వేద వైద్యశాస్త్రమునందు కఫ రోగ చికిత్సలో ప్రాచుర్యంలో ఉన్న ఔషధాలలో వాసారిష్ట ఒకటి. దీని తయారీ, ఉపయోగాల గురించి ఆయుర్వేద శాస్త్ర గ్రంధాలైన భైషజ్య రత్నావళి, సహస్రయోగా మొదలైన గ్రంధాలలో చెప్పబడింది. వాసారిష్టను అడ్డసరము ఆకుల రసం, దానికి సమానంగా మృతసంజీవనీ సురా కలిపి తయారుచేస్తారు.


ఉపయోగాలు: శ్వాస (డిస్‌నోయియా/ఆస్తమా), కాస (దగ్గు), రక్తపిత్త (హెమరేజిక్‌ డయాఽథెసిస్‌, బ్లీడింగ్‌ డిజార్డర్స్‌), కంఠ రోగ (డిసీజ్‌ ఆఫ్‌ ది త్రోట్‌), ఊరక్షత (చెస్ట్‌ ఇంజురీ) మొదలైన రోగాల చికిత్సలో వాసారిష్టను ఉపయోగిస్తారు. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన కఫ సమస్యల్లో, జలుబు చేసినప్పుడు వచ్చే వినికిడి సమస్యలకు, ముక్కులు బిగదీసుకుపోవడం వంటి వాటిలో విశేషంగా పనిచేస్తుంది. అదేవిధంగా చిన్నపిల్లల్లో వచ్చే కఫ సంబంధిత వినికిడి సమస్యలకు వాసారిష్ట పనిచేస్తుంది. తరచూ కఫ సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడే చిన్నపిల్లలకు వస వేరు చేతికి కట్టడం మన సంప్రదాయంగా వస్తోంది. చేతికి కట్టిన వస వేళ్లు నోటితో చీకడంతో వాళ్లకు ఉన్న కఫ సమస్యలు తగ్గి, ఆరోగ్యంగా ఉండేవారు.


ఉపయోగించే మోతాదు: దీనిని పెద్దలు 10 మి.లీటర్లు, పిల్లలు 5 మి.లీటర్లు చొప్పున ఉదయం, సాయంత్రం లేదా వైద్యుల సూచనమేరకు వాడవలెను. ప్రస్తుతం ధూద్‌ పాపేశ్వర్‌, జైద్యనాధ్‌, వైద్యరత్న వంటి ఆయుర్వేద మందుల సంస్థలు దీనిని తయారుచేస్తున్నాయి.


శశిధర్‌, అనువంశిక ఆయుర్వేద వైద్య నిపుణులు,

సనాతన జీవన్‌ట్రస్ట్‌, కొత్తపేట, చీరాల.

Updated Date - 2021-02-02T07:42:32+05:30 IST