Advertisement
Advertisement
Abn logo
Advertisement

పెట్రో ధరలపై వ్యాట్‌ తగ్గించాలి : బీజేపీ

మేడ్చల్‌/కీసర రూరల్‌/ శామీర్‌పేట/మర్పల్లి/ ధారూరు/ బంట్వారం/కులకచర్ల/పరిగి/కొడంగల్‌/బొంరాస్‌పేట్‌ : కేంద్ర ప్రభుత్వం మాదిరి తెలంగాణ ప్రభుత్వం కూడా పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం మేడ్చల్‌, వికారాబాద్‌ జిల్లాల పరిధిలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేడ్చల్‌తో పాటు గుండ్లపోచంపల్లి మున్సిపల్‌ కార్యాలయం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. గుండ్లపోచంపల్లి మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఆటోకు తాడు కట్టి ప్రదర్శన నిర్వహించారు. మేడ్చల్‌లో అంబేద్కర్‌ విగ్రహం వద్ద బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఆయా కార్యక్రమాల్లో కౌన్సిలర్లు అమర సరస్వతీమోహన్‌రెడ్డి, హంసకృష్ణగౌడ్‌, నరేందర్‌రెడ్డి,  ఆంజనేయులు, రాఘవరెడ్డి, పాతూరి ప్రభాకర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. వ్యాట్‌(వీఏటీ)ను తగ్గించాలని కోరుతూ బీజేపీ నాగారం మున్సిపల్‌  అధ్యక్షుడు మొసలి కేశవరెడ్డి డిమాండ్‌ మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించి కమిషనర్‌కు వినతి  పత్రం అందజేసారు. కార్యక్రమంలో నాయకులు జూపల్లి నరేష్‌, కిశోర్‌, వేణుగోపాల్‌, శ్రీనివా్‌సరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పెట్రో ధరలపై వ్యాట్‌ తగ్గించకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను నయవంచనకు గురిచేస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బుద్ది శ్రీనివాస్‌ అన్నారు. శామీర్‌పేట మండలం అలియబాద్‌ చౌరస్తా వద్ద బీజేపీ మండలాధ్యక్షుడు కైర యాదగిరి ఆధ్వర్యంలో ప్లకార్డులు ప్రదర్శించి ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు వంగరి హృదయ్‌కుమార్‌, నూనెముంతల రవీందర్‌గౌడ్‌, హైమారెడ్డి, అశోక్‌, మల్లేష్‌, సుధాకర్‌నాయక్‌, వివేకానంద, సునీతనాయక్‌, తదితరులు పాల్గొన్నారు. అలాగే వికారాబాద్‌ జిల్లా మర్పల్లిలో రాష్ట్ర ప్రభుత్వం డీజిల్‌, పెట్రోల్‌ ధరలపై వెంటనే వ్యాట్‌ తగ్గించాలని బీజేపీ మండల నాయకులు మల్లేష్‌యాదవ్‌ డిమాండ్‌ చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ట్రాక్టర్‌కు తాళ్లుకట్టి లాగుతూ నిరసన తెలిపారు.  అలాగే పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై వ్యాట్‌ తగ్గించాలని బీజేపీ బంట్వారం మండలాధ్యక్షుడు మహేష్‌ అన్నారు. మండల కేంద్రంలోని బస్‌స్టేషన్‌ ఆవరణలో బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేవైఎం మండలాధ్యక్షుడు శేఖర్‌, మల్లేషం, సుభాష్‌, రాజు, నాగరాజు, వెంకటేశం, శంకర్‌, తదితరులు పాల్గొన్నారు. పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రహ్లాద్‌రావు డిమాండ్‌ చేశారు.  కులకచర్లలో బీజేపీ ఆధ్వర్యంలో ట్రాక్టర్‌కు తాళ్లుకట్టి గ్రామం నుంచి చౌరస్తా వరకు లాగారు. చౌరస్తాలో బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాధాలు చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి వెంకటయ్యగౌడ్‌, పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు మైపాల్‌, హన్మంతు, సురేందర్‌గౌడ్‌, సంతుగౌడ్‌, జానక్‌రాం, వెంకటేశ్‌. మైపాల్‌ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ను వెంటనే తగ్గించాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో పరిగిలోని కొడంగల్‌ చౌరస్తా నుంచి ఆర్టీసి బస్టాండ్‌ వరకు ఎడ్ల బండితో నిరసన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశ్‌, కార్యదర్శి హరికృష్ణలు మాట్లాడుతూ, కేంద్రప్రభుత్వం పెట్రోలపై రూ.5, డీజిల్‌పై రూ.10లు తగ్గిస్తే రాష్ట్ర ప్రభుత్వం కనీసం వ్యాట్‌ను తగ్గించకుండా చోద్యం చూస్తుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు ఆంజనేయులు, పట్టణాధ్యక్షుడు శ్రీశైలం, నాయకులు నర్సింహ, రమేశ్‌, రాంరెడ్డి, వెంకటేశ్‌, శ్రీనివాస్‌, అశోక్‌, తదితరులు పాల్గొన్నారు. అలాగేరాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించాలంటూ బీజేపీ ఆధ్వర్యంలో కొడంగల్‌ నియోజకవర్గంలోని బొంరాస్‌పేట్‌, కొడంగల్‌మండల కేంద్రాల్లో నాయకులు నిరసన తెలుపుతూ తహసీల్దార్‌లకు వినతి పత్రాలను అందించారు. ఆయా కార్యక్రమాల్లో బీజేపీ నాయకులు పూనంచంద్‌లాహోటి, ఆర్‌.మోహన్‌రావు, లక్ష్మణ్‌గౌడ్‌, సి.చంద్రశేర్‌, కె.చంద్రప్ప, దుబ్బస్‌కిష్టయ్య, శ్రీనివాస్‌, నర్సింలు, బాబయ్యనాయుడు, నాగురావు, గోవర్ధన్‌రెడ్డి, అనిల్‌, మల్లేశ్‌, ఆలం రాములు, నర్సిములు, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement